NewsFx

Fresh off the feed

ఈ వేసవి చాలా హాట్..రాష్ట్రాలకు కేంద్రం హెల్త్ అడ్వైజరీ ☀️

ఈ వేసవి చాలా హాట్..రాష్ట్రాలకు కేంద్రం హెల్త్ అడ్వైజరీ ☀️

ఫిబ్రవరిలోనే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ వేసవి చాలా హాట్‌గా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గతవారం రోజులుగా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 11 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యాయి. దేశంలో 1877 తర్వాత ఈ ఫిబ్రవరిలోనే గరిష్ఠ సగటు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎమ్‌డీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది సగటు ఉష్ణోగ్రత 29.54 డిగ్రీలుగా నమోదైందని, గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగానే ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు పేర్కొంది.

Sources

From the MediaFx archive.