NewsFx

Fresh off the feed

సురవరం ప్రతాపరెడ్డికి ఘన నివాళి 💐💐💐

సురవరం ప్రతాపరెడ్డికి ఘన నివాళి 💐💐💐

జోగులాంబ గద్వాల సాహితీ* అధ్వర్యంలో సురవరం ప్రతాపరెడ్డి జయంతిని పురస్కరించుకొని గద్వాల పట్టణం రాజీవ్ మార్గ్ లో ఉన్న సురవరం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సురవరం ప్రతాపరెడ్డి చేసిన సేవలను స్మరించడం జరిగింది. తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి (మే 28, 1896 - ఆగస్టు 25, 1953). పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి అతను పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణలో కవులే లేరనే నిందావ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 కవులతో కూడిన "గోల్కొండ కవుల సంచిక" గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. ఈ కార్యక్రమంలో అంబటి భానుప్రకాశ్, అనిమోని మహేందర్, డాక్టర్ మంగళగిరి శ్రీనివాసులు సహాయ ఆచార్యులు, సఫారీ శంకర్ అధ్యాపకులు , చిన్నారులు మంగళగిరి శాస్మిత్ సాయి ,మంగళగిరి కార్తిక్ సాయి తదితరులు పాల్గొన్నారు.

Sources

From the MediaFx archive.