
సైలెంట్‌గా అకీరా నందన్ ఎంట్రీ..పవన్ కళ్యాణ్ తనయుడు...
Akira: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరానందన్ సైలెంట్గామ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చేశాడు. నిజమే తను రైటర్స్ బ్లాక్ అనే షార్ట్ ఫిల్మ్‌కు సంగీతాన్ని అందించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో అడివి శేష్ ట్వీట్ చేశారు.

రీసెంట్గా 19వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు జనసేనాని, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్. ప్రస్తుతం చదువుకు, సంగీతం నేర్చుకోవటంతో పాటు అడపా దడపా బయట కనిపిస్తున్నాడు అకీరా. అయితే అభిమానులు అతని సినీ ఎంట్రీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్‌గానే అకీరా తన 19వ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నాడు. దీంతో అభిమానులందరూనెట్టింట అకీరా సినీ ఎంట్రీ గురించి వెయిట్ చేస్తున్నామంటూ ట్వీట్స్ కూడా చేశారు.అయితే వాళ్లందరూ అకీరాను సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా చూడాలనుకుంటున్నారు. కానీ అకీరా మాత్రం సైలెంట్‌గా మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వటానికి రెడీ అవుతున్నారనిపిస్తుంది. ఎందుకంటే రైటర్స్ బ్లాక్ అనే షార్ట్ ఫిల్మ్‌కు అకీరా సంగీతాన్ని అందించాడు. ఈ విషయాన్ని హీరో అడివిశేష్ తెలియజేస్తూ రైటర్స్ బ్లాక్ షార్ట్ ఫిల్మ్ లింక్‌ను ట్వీట్ చేశారు. ఓ రైటర్ కథను రాసే క్రమంలో ఎలాంటి సవాళ్లను ఫేస్ చేశాడనేదే ఈ షార్ట్ ఫిల్మ్ కథాంశం. ఈ షార్ట్ ఫిల్మ్ వ్యవథి నాలుగున్నర నిమిషాలు. ఇందులో మ్యూజిక్ బావుందని కామెంట్స్ వస్తున్నాయి. ఈ షార్ట్ ఫిల్మ్‌ను ఇంగ్లీష్‌లోనే తెరకెక్కించారు. కార్తికేయ యార్లగడ్డ దీన్ని తెరకెక్కించారు.అకీరా నందన్‌కు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. తన పియానోపై మ్యూజిక్ ప్లే చేసిన వీడియోలు నెట్టింట వైరల్ కూడా అయ్యాయి. ఈ క్రమంలో అకీరా సైలెంట్‌గా, మ్యూజిక్ డైరెక్టర్లా ఎంట్రీ ఇచ్చేసి అందరికీ షాకిచ్చాడనే చెప్పాలి. మెగా వారసుడిగా హీరోగా చూడాలని అందరూ ఎదురు చూస్తుంటే తను మాత్రం ట్విస్ట్ ఇచ్చాడు. నిజంగానే పవన్ తనయుడికి హీరో కావాలని లేదా? లేక మ్యూజిక్ హాబీగా నేర్చుకుని ఈ షార్ట్ ఫిల్మ్‌కు సంగీతం అందించాడా? అనేది తెలియటం లేదు.
Open original embedded content
Open original embedded content
Open original embedded content
Open original embedded content
Sources
From the MediaFx archive.
