
చిరంజీవి ప్రస్తుతం ‘భోలా శంకర్’ చిత్రంలో నటిస్తున్నారు..
మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయిక కాగా.. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో కనిపించనుంది.

అనిల్ సుంకర నిర్మిస్తున్న చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇది తమిళ్‌లో అజిత్ నటించిన ‘వేదాళం’ చిత్రానికి రీమేక్. ఇక ఈ ఏడాది ప్రారంభంలోనే చిరు.. ‘వాల్తేర్ వీరయ్య’ చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, ‘భోలా శంకర్’ తర్వాత చిరంజీవి నటించబోయే సినిమా గురించి సస్పెన్స్ కొనసాగుతోంది. పూరీ జగన్నాథ్, వీవీ వినాయక్ వంటి సీనియర్ దర్శకులకు చాన్స్ ఇచ్చినప్పటికీ.. వారు తమ కథలతో మెగాస్టార్‌ను మెప్పించలేకపోయారు. ఇదే క్రమంలో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల పేరు వినిపించినప్పటికీ.. చివరకు తను నితిన్‌తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఇక రీసెంట్‌గా బింబిసార డైరెక్టర్ మల్లిడ్ వశిష్ట్ పేరు తెరపైకి వచ్చింది. కానీ ఇది ఫేక్ న్యూస్ అని ఇండస్ట్రీ వర్గాలు తేల్చేశాయి.
Sources
From the MediaFx archive.
