NewsFx

Fresh off the feed

ధరణి పోర్టల్ లోపలే కాంగ్రెస్ ప్రచార ప్రధాన అస్త్రమా?

ధరణి పోర్టల్ లోపలే కాంగ్రెస్ ప్రచార ప్రధాన అస్త్రమా?

త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో భూసమస్య పైనే కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించినట్లు తెలుస్తుంది. గత కొన్ని నెలలుగా సీఎం కెసిఆర్ ఆయన మంత్రివర్గం చేస్తున్న భూ కుంభకోణలు, భూ ఆక్రమణలు, అక్రమ కేటాయింపులు మరియు చివరకు ధరణి పోర్టల్‌లో అవకతవకలకు సంబంధించిన సమస్యలపై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ నిరంతరం పోరాటలు చేస్తుంది. ఈ వారంలోనే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భూ సమస్యలపై విలేకరుల సమావేశాలు నిర్వహించి సాక్ష్యాధారాలతో, ముఖ్యమంత్రికి మరియు వారి స్నేహితులకు ఎంత విలువైన భూమిని కేటాయించారో రేవంత్ రెడ్డి సాక్ష్యదారాలతో నిరూపించారు. అక్రమ భూ ఒప్పందాల చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ అత్యంత వ్యూహాత్మకంగా దాడి చేస్తుంది. ఈ ఏడాది ఆఖరులో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈ ఆందోళలనను మరింత దూకుడుగా వెళ్లాలని కాంగ్రెస్ వ్యూహం రచిస్తుంది. గతంలో ధరణి పోర్టల్ అక్రమాలపై కాంగ్రస్ పార్టీ ఒక నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రజల బాధలను వినేందుకు బహిరంగ సభలు మరియు రచ్చబండలు నిర్వహించారు. ఈ కమిటీకి పార్టీ సీనియర్ నాయకుడు మరియు మాజీ డిప్యూటీ సిఎం దామోదర్ రాజనరసింహ నాయకత్వం వహించారు మరియు ధరణి పోర్టల్ ద్వారా నష్టపోయిన రైతులు నుండి వివరాలను మరియు మద్దతును సేకరించగలిగారు. ఈ సంవత్సరం 2023లో ధరణి అక్రమాలపై తెలంగాణ కాంగ్రెస్ పోరాటం పునరుద్ధరించి తిరిగి ప్రారంభించినప్పుడు ప్రజలలో విశేష ఆదరణ మరియు మద్దతు లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ధరణి పై ఫిర్యాదులను నమోదు చేయడానికి ధరణి యాప్‌ను ఉపయోగించడం ద్వారా, రాబోయే ఎన్నికలకు లబ్ది చేకూరుతుందని ఈ యాప్ ని పార్టీ ప్రవేశపెట్టింది. వచ్చే ఎన్నికలలో తెలంగాణా రాష్ట్రంలోని అత్యంత ముఖ్యమైన వనరు అయ్యిన భూ కుంభకోణాలుపై కెసిఆర్ ప్రభుత్వంపై పోరుకు కాంగ్రెస్ సిద్ధం అవుతుంది. ఓటరు కూడా వారి కోసం ఎవరు పోరాడతున్నారో మరియు ఎలా పోరాడుతారో నిశితంగా గమనిస్తున్నారు .

ధరణి పోర్టల్ లోపలపై కాంగ్రెస్ పార్టీ సమర్ధవంతంగా పోరాటం చేస్తుంది అని మీరు భావిస్తున్నారా?

  • బాగా పోరాటం చేస్తుంది.
  • పర్వాలేదు
  • తెలియదు
Archived poll; voting and vote totals are not migrated.

Sources

From the MediaFx archive.