NewsFx

Fresh off the feed

ఒట్టు (చాప్టర్ 2)

ఒట్టు (చాప్టర్ 2)

గత ఏడాది మలయాళం థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఆహా లో అందుబాటులో ఉంది…  సినిమా చరిత్ర లో మునుపెన్నడూ చెయ్యని సాహసం ఈ సినిమా తో చేశారు…

మొత్తం 3 పార్టులుగా ఉన్న సినిమా నీ రెండవ పార్టు ముందు రిలీజ్ చేసి … ప్రిక్వెల్ మరియు సీక్వెల్ ఉంటుంది అని కుతూహలం క్రియేట్ చెద్ధమనే ప్రయత్నం లో డైరెక్టర్ ఫెల్లిన్ T.P విజయం సాధించగలిగార లేదా అని తెలుసుకుందాం…

సినిమా : ఒట్టు (చాప్టర్ 2)

నటి నటులు : కుంచక్కో బుబన్,అరవింద్ స్వామి,జాకీ ష్రాఫ్ & ఇషా రెబ్బా.

డైరెక్టర్ : T.P. ఫేల్లిన్ 

సినిమా ప్రారంభం లోనే కథ లోకి తీసుకెళ్లడం లో దర్శకుడు విజయం సాధించాడు… హీరో కుంచక్కొ బుబన్ కి ఒక డీల్ వస్తుంది. ఎన్నో కోట్లు విలువ చేసిన బంగారాన్ని దాచి గతాన్ని మరచి పోయిన అరవింద స్వామి తో గతం గుర్తు చేసి దాచిన బంగారం ఎక్కడుందో తెలుసుకోవడమే హీరో కి వచ్చిన డీల్…

అసలు అరవింద్ స్వామి ఎవరు… ఎందుకు గతం మరచి పోయాడు… హీరో ప్రయత్నం సఫలీకృతం అయ్యిందా… అనేదే కథ.

కథలో కొత్త దనం ఉంది… కానీ కథనం చాలా నెమ్మదిగా ఉంటుంది… 1.45 నిమిషాల నిడివి గల ఈ సినిమాలో… స్క్రీన్ మొత్తం హీరో కుంచాక్కో బుబన్ & అరవింద్ స్వామి జర్నీ నే ఎక్కువగా ఉండి మనకు బోర్ తెప్పించే ప్రయత్నం తెప్పిస్తుంది… కానీ  చివరి 40 నిమిషాలు రఫ్ ఆడించేసాడు దర్శకుడు… ఊహించని ట్విస్ట్ లు యాక్షన్ సీన్స్ అరవింద్ స్వామి ఎలివేషన్ షాట్స్ చాలా బాగున్నాయి… కెమెరా వర్క్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది… తెలుగు లో డబ్ అయిన పాటలను స్కిప్ చెయ్యడం మంచిది.

యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ ఒట్టు చివరి 40 నిమిషాల కథే ఆయువు పట్టు… OTT లోనే కాబట్టి ఒక్కసారి చూడవచ్చు… పిల్లలతో చుడొచ్చా అంటే…2 లిప్ లాక్ సీన్స్ & కొన్ని చోట్ల సెమీ న్యూడ్ ఉంటుంది. మొత్తానికి ఓపిక తో చూసిన నాకైతే నచ్చింది. ఈ మధ్య OTT లో వచ్చే చెత్త సినిమాలకంటే ఇది బెటర్ అని నా ఫీలింగ్.. ఈ సినిమా కి వచ్చే ప్రీక్వెల్ & సీక్వెల్ ఇంకా బాగుంటుంది అనే నమ్మకాన్ని దర్శకుడు కథ చివర్లో ఆసక్తి పెంచడం లో సక్సెస్ అయ్యాడు.

ఈ సినిమా కి నా రేటింగ్ : 3/5

Sources

From the MediaFx archive.