
దర్శకుడు
ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని … ఆకలి బాధలను భరిస్తూ… అవమానాలు దిగమింగుకుంటూ… కన్నీళ్లను రెప్ప మాటున దాచుకుంటూ… రేపటి కల కోసం నిత్యం పోరాడే యోధుడు… సినిమా వాడు.
పుట్టిన ఆలోచనని… కథ గా మలుచుకొని… కథనం గా తీర్చి దిద్ది… దృశ్య రూపం గా ఊహించుకొని…నిద్ర లేని రాత్రులు కరిగితే చివరకి అన్ని పురిటి నొప్పులను దాటుకొని బయటకొస్తుంది సినిమా కథ.
సినిమా వాడి గా అన్ని సినిమాలు చూస్తాను... టెక్నికల్ గా సినిమా వల్ల నేర్చుకుంటాను... కొన్ని మంచి సినిమాలు సరిగ్గా ఆడకపోతే భాద పడతాను... ఎందుకు ఆడలేదని సినిమా మీద నాలో నేనే ప్రశ్నించు కుంటాను... ఒక మాస్ సినిమా కథలో దమ్ము లేకున్నా ఎలివేషన్ తో హిట్ అవుతే ఎందుకు హిట్ అయ్యిందని మళ్ళీ ప్రశ్నించుకుంటాను... ఎందుకంటే... నేను రానున్న కాలం లో ఒక దర్శకుడు అవ్వాలని ప్రయత్నం లో ఉన్నాను కాబట్టి... ప్రతి సినిమా నాకు గురువు తో సమానం... నాకు ఎంతో కొంత నేర్పించి నన్ను ఒక గొప్ప విద్యార్థి గా తీర్చి దిద్దుతుంది...
ఎందుకంటే…
నా జీవితం... నా గమ్యం... నా ప్రాణం...
ఒక్కటే…
కథ
స్క్రీన్ ప్లే
దర్శకత్వం
సినిమావాడు
Sources
From the MediaFx archive.
