
ఒక సిమ్ కార్డు వాలా అమ్మాయి బాలి...! అసలు ఏమైనది ....?
పటాన్‌చెరు : హైదరాబాద్ శివారు పటాన్‌చెరు పట్టణంలో ఓ కాలనీకి చెందిన మైనర్ బాలిక ఒక సిమ్ కార్డు కొనుగోలు చేసింది. అయితే అది ఇంతకు ముందు మరొకరు వాడి వదిలేశారు. ఆ తర్వాత ఓ బాలిక ఆ సిమ్‌ను తీసుకుని వాడుతోంది. ఈ క్రమంలోనే ఈ నంబర్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురానికి చెందిన మేస్త్రీ పనిచేసే యవకుడు ఫోన్ చేస్తున్నాడు. తనను ప్రేమించమంటూ ఆమెను వేధింపులకు గురిచేశాడు. విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో ఆ యువకుడిని మందలించారు. అయినా.. మళ్లీ ఆ వ్యక్తి ఫోన్ చేసి వేధించడంతో బాలిక చీరతో ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుంది. జరిగిన దారుణంపై బాధితురాలి కుటుంబ సభ్యులు పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Sources
From the MediaFx archive.